దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనం లాంటి సేవారంగంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలకు ఫలితం దక్కింది.ఈ రంగంలో దేశంలో మరే ఇతర రాష్ట్రం సాధించని వృద్ధిరేటును తెలంగాణ నమోదు చేసి నట్టు ‘ఇండియా సర్వీస్ సెక్టార్-ఇన్సైట్స్ ఫ్రమ్ జీస్వీఏ ట్రెండ్స్ అండ్ స్టేట్ లెవల్ డైనమిక్స్- ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్’ పేరిట కేంద్రప్రభుత్వ మేధో సంస్థ ‘నీతిఆయోగ్’ తాజాగా వెల్లడించింది.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనంగా మారిన సేవారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తేనే రాష్ట్రం ఆర్థికంగా సర్వోన్నతాభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భావించారు. ఈ క్రమంలోనే కొత్తగా ఏర్పడిన తెలంగాణను సేవారంగానికి చిరునామాగా మార్చడానికి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. తద్వారా ఐటీ, స్టార్టప్, ఆతిథ్య, వ్యాపార, రియల్ఎస్టేట్ తదితర రంగాలకు కొత్త జవసత్వాలు అద్దారు. దీని ఫలితమే కేసీఆర్ పాలనలో సేవారంగంలో తెలంగాణ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. దేశంలో మరేఇతర రాష్ట్రం సాధించనటువంటి వృద్ధిరేటును నమోదుచేసింది. తద్వారా సేవల రంగం నుంచి ఆదాయాన్ని ఆర్జించడంలో, ఉద్యోగావకాశాలు కల్పించడంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ‘ఇండియా సర్వీస్ సెక్టార్-ఇన్సైట్స్ ఫ్రమ్ జీవీఏ ట్రెండ్స్ అండ్ స్టేట్ లెవల్ డైనమిక్స్- ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్’ పేరిట కేంద్రప్రభుత్వ మేధో సంస్థ ‘నీతిఆయోగ్’ తాజాగా విడుదల చేసిన రెండు నివేదికల్లో వెల్లడించింది.
సేవల్లో తెలంగాణ భేష్
రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సూచికగా నిలిచే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జతచేరిన అదనపు విలువ (గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్-జీఎస్వీఏ)లో సేవారంగం వాటాపై నీతిఆయోగ్ తాజా నివేదికను విడుదల చేసింది. కేసీఆర్ పాలనలో తెలంగాణ జీఎస్వీఏలో సేవారంగం వాటా 9.6 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. 2011-12లో జీఎస్వీఏలో సేవారంగం వాటా 51.8 శాతంగా నమోదైతే, 2023-24లో ఇది 62.4 శాతానికి ఎగబాకినట్టు నివేదిక వెల్లడించింది. జాతీయ సగటు 54.5 శాతం కంటే ఇది దాదాపుగా 8 శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. మొత్తంగా తెలంగాణ జీఎస్వీఏలో సగటు సేవారంగం వాటా 60.3 శాతంగా నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. జీఎస్వీఏలో సేవారంగం వాటా వృద్ధిరేటు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు నివేదిక ప్రశంసించింది. ఐటీ, స్టార్టప్ ఎకోసిస్టమ్, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు, ఆర్థిక సేవలు ఈ వృద్ధికి ప్రధాన కారణంగా వివరించింది.
కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో ఏర్పాటైన స్టార్టప్ ఎకో సిస్టమ్, పెరిగిన ఐటీ ఎగుమతులతో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలిచే బెంగళూరు రాజధానిగా ఉన్న కర్ణాటకను తోసిరాజని సేవారంగం వృద్ధిరేటులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినట్టు నీతిఆయోగ్ నివేదికను బట్టి అర్థమవుతున్నది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ప్రొఫెషనల్ సర్వీసెస్ తదితర రంగాలు 34.1శాతం వాటాతో సుస్థిరాభివృద్ధి, ఆవిష్కరణలు, పట్టణ విస్తరణను సూచిస్తున్నట్టు నివేదిక తెలిపింది. తెలంగాణలోని సర్వీస్ సెక్టార్‌పై ఆధారపడి 62 లక్షల మంది (శ్రామిక శక్తిలో 34.8 శాతం) ఉపాధి పొందుతున్నట్టు నివేదిక వివరించింది. జాతీయ సగటు 29.7 శాతంతో పోలిస్తే, ఇది 5.1 శాతం ఎక్కువ అని వివరించింది. గడిచిన పదేండ్లలో హైదరాబాద్ చుట్టూ విస్తరించిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ ఎగుమతులు, ప్రొఫెషనల్ సేవలు ఈ పెరుగుదలకు ఊతమిచ్చినట్టు నివేదికలో పేర్కొంది.
కేసీఆర్ ఆవిష్కరణలపై ప్రశంసల వర్షం
కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తెలంగాణలో జరిగిన సమ్మిళితాభివృద్ధిని ఇప్పటికే పలు నివేదికలు ప్రశంసించాయి. తాజాగా నీతిఆయోగ్ కూడా కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రత్యేకంగా కొనియాడింది. స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 2015లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన టీ-హబ్‌ను, హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీకి ఊతంగా నిలిచేలా 2023లో ప్రారంభించిన టీ-వర్క్స్‌ను, విద్యార్థుల నైపుణ్య శిక్షణకు కేసీఆర్ సర్కార్ తెచ్చిన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) కార్యక్రమాలను, వాటి ద్వారా జరిగిన లబ్ధిని నీతిఆయోగ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వినూత్న కార్యక్రమాలతో హైదరాబాద్‌లో స్టార్టప్ ఎకో సిస్టమ్ ముఖచిత్రమే మారిపోయిందని, ఐటీ ఎగుమతులు పెరిగినట్టు కొనియాడింది.
బీఆర్ఎస్ హయాంలో గణనీయ వృద్ధి
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఐటీ, ఫైనాన్స్, బీమా తదితర సేవా రం గాలు గణనీయంగా వృద్ధిచెందాయి. ము ఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ రంగంలో స్టార్ట ప్స్ సంఖ్య 2016లో 400 ఉండగా, 2022నాటికి వాటి సంఖ్య 2000లకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు, 2023 నాటికి 1500 ఐటీ/ఐటీఈఎస్ కంపెనీలు, 9 లక్షల మంది ఉద్యోగులతో హైదరాబాద్ దేశంలోనే ప్రధాన ఐటీ కేంద్రంగా ఎదిగింది. కేసీఆర్ పాలనలో ఇతర ఏ రాష్ట్రం లో లేనివిధంగా తెలంగాణకు ప్రపంచంలోని దిగ్గజ ఐటీ కంపెనీలు క్యూకట్టాయి. ముఖ్యంగా అప్పటి ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ కృషితో గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, విప్రో, టెక్ మహీంద్రా, ఒరాకిల్ తదితర అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించాయి. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 321.38%, ఐటీ ఉద్యోగాల్లో 180.06% పెరుగుదల నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు గతంలో పేర్కొనడం తెలిసిందే.
తెలంగాణ సేవారంగంలో ఎవరి వాటా ఎంతంటే..
మానవ వనరులు
ప్రాంతాలు
సబ్ సెక్టార్
రాష్ట్రంలో ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు ఇలా..
2023-24లో జీఎస్వీఏలో సేవారంగం వాటా ;62.4% – 54.5% = 7.9%తేడా
2023-24లో సేవా రంగంలో ఉద్యోగులు ; 34.8% – 29.7% = 5.1%తేడా
సేవా రంగం వాటా
