శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 16:09:32

అభివృద్ధే సర్కారు లక్ష్యం : మంత్రి హరీశ్ రావు

అభివృద్ధే సర్కారు లక్ష్యం : మంత్రి హరీశ్ రావు

మెదక్ : అభివృద్ధే పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు  స్పష్టం చేశారు. జిల్లాలోని పాపన్నపేట మండలం యూసుఫ్ పేటలో  మంత్రి పర్యటించారు . గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల శంకుస్థాపన తోపాటు ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతి పైసా పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,  ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు .logo