నల్లగొండ : అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిది అందే వేసిన చెయ్యని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపన్న హస్తం అందుకుంటే అభివృద్ధి మీ చెంతకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. సోలిపురంలో బ్రిడ్జి,రహదారుల నిర్మాణం వంటి పనులు పేరుకపోయాయి అంటే అందుకు కారణం ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించిన పాలకుల వైఫల్యం అని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలోని మునుగోడు మండలం సోలిపురం గ్రామంలో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులంతా ఏకమై మా గ్రామంలో సమావేశం పెట్టాలన్న కోరిక పై సోలిపురం లో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకీ చెందిన సర్పంచ్ తో పాటు గ్రామస్తులందరు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మునుగోడుకు కేవలం నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న సోలిపురం గ్రామానికి రహదారి, వాగు దాటేందుకు బ్రిడ్జి లేక తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వారు మంత్రి జగదీష్ రెడ్డికి మొర పెట్టుకున్నారు. అందుకు స్పందించిన మంత్రి 2014 కు పూర్వం రాష్ట్రాన్ని పాలించిన పాలకులే కారణమన్నారు.
అధికారంలోకి వచ్చిందే తడవుగా మునుగోడు ప్రజలను కభళించిన ఫ్లోరోసిస్ భూతాన్ని మిషన్ భగీరథ పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పార ద్రోలిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వాస్తవానికి ఇక్కడ అభివృద్ధి జరిగింది అంటే అది 2014 నుండి 2018 వరకు మాత్రమే నన్నారు.
అప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిరంతరం ప్రజల మద్యనే ఉంటూ ఈ తరహా సనస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ప్రజల సమస్యలు అంతగా పట్టవన్నారు.
సోలిపురం ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు మొదలు పెడతామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ స్వామి, మండల పార్టీ అధ్యక్షుడు బండా పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.