Lagnesh Kumar : కంటి సంబంధ ఇన్ఫెక్షన్ (Eye infection) అతడి జీవితాన్ని చీకటి చేసింది. కానీ అతడి సంకల్పం ముందు ఆ వైకల్యం ఓడిపోయింది. పట్టుదలతో లా చదివి, రెండేళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. అతడే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రం బిలాస్‌పుర్ జిల్లా ఘుమార్విన్ (Ghumarvin) సబ్‌డివిజన్‌లోని బరోటా (Barota) గ్రామానికి చెందిన అగ్నేష్ కుమార్ (Lagnesh Kumar).
33 ఏళ్ల లగ్నేష్ కుమార్.. ఘుమార్విన్ సివిల్ కోర్టులో రెండేళ్లుగా ప్రాక్టీసు చేస్తున్నారు. హిమాచల్ న్యాయచరిత్రలో వంద శాతం దృష్టిలోపం ఉన్న తొలి న్యాయవాదిగా ఆయన గుర్తింపు పొందారు. 2009లో కళ్లకు సోకిన తీవ్రమైన ఇన్ఫెక్షన్తో లగ్నేష్ చూపు కోల్పోయారు. తండ్రి చనిపోయాక తల్లి ఓ అంగన్వాడీ కేంద్రంలో సహాయకురాలిగా పనిచేస్తూ ఎన్నో కష్టాలు పడి న్యాయవాది కావాలన్న కుమారుడి కల నెరవేరేందుకు దోహదపడింది.
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయవాద విద్య అభ్యసించిన లగ్నేశ్ బ్రెయిలీ లిపితోపాటు సాంకేతికత, సహాయ పరికరాల సాయంతో తన వృత్తిలో రాణిస్తున్నారు.