Funky Movie | నాగవంశీ నోటికి పని చెప్పకుంటే బాగుంటుంది.. ‘ఫంకీ’ ఈవెంట్ వ్యాఖ్యలపై నెటిజన్ల ఫైర్!
NagaVamsi | యువ నిర్మాత నాగవంశీ తన ముక్కుసూటి తనానికి, అప్పుడప్పుడు చేసే వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా 'ఫంకీ' (Funky) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నాయి.
Funky Movie | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. విశ్వక్ సేన్ హీరోగా, అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫంకీ’ చిత్ర ట్రైలర్ విడుదల వేడుకలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడూ తన సినిమాలపై విపరీతమైన నమ్మకంతో ఉండే నాగవంశీ, ఈసారి మాత్రం కాస్త వెటకారం, అతి విశ్వాసం కలిసినట్లుగా మాట్లాడటం నెటిజన్లకు రుచించడం లేదు.
ముఖ్యంగా సినిమా గురించి చెబుతూ.. ఈ సినిమాలో గొప్ప కథను కానీ, గుండెల్ని పిండేసే ఎమోషన్స్‌ను కానీ ఆశించకండి. అనుదీప్ సినిమాల్లో అవి ఉండవు. కేవలం రెండు గంటల పాటు నవ్వుకోవడానికే రండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దర్శకుడిని కించపరిచినట్లు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కూడా ‘వార్ 2’ ఈవెంట్లో నాగవంశీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ మందలించినట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో నేను ఫ్లోలో అలా మాట్లాడేశాను, జాగ్రత్తగా ఉంటాను అని చెప్పిన నాగవంశీ, మళ్ళీ ఇప్పుడు ‘ఫంకీ’ ఈవెంట్లో అదే బాణిని కొనసాగించడం చూసి ఆయన నోటికి పని చెప్పకుంటేనే ఆయన సినిమాలకు, ఇమేజ్‌కు మంచిది అంటూ ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు. ఫిబ్రవరి 13న విడుదల కానున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో కానీ, ఈ లోపే నాగవంశీ వ్యాఖ్యలు సినిమాపై నెగటివ్ బజ్ క్రియేట్ చేసేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

