ఖమ్మం, డిసెంబర్ 28: జర్నలిస్టు లోకానికి పిడుగులాంటి వార్త ఇది. ‘మీకు ఇండ్ల స్థలాలు ఇచ్చేదే లేదు’ అని సాక్షాత్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల జారీలో కోత విధించవద్దని, వివక్షకు కారణమవుతున్న జీవో 252ను సవరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే -టీజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొందరు జర్నలిస్టులు ఆదివారం ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. జీవోను సవరించాలని, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని యూనియన్ నాయకులు విజ్ఞ ప్తి చేశారు. దీనికి డిప్యూటీ సీఎం స్పం దిస్తూ.. ‘ఇండ్లస్థలాల అంశంలో సమాలోచన అవసరం, జర్నలిస్టులకు అర్బన్ లిమిట్లోని 5 కిలోమీటర్ల పరిధిలో ఇండ్లస్థలాలు ఇచ్చేందుకు వెసులుబాటు లేదు.
బీపీఎల్ (బిలో పావర్టీ లైన్) కోటా కింద కావాలనుకుంటే.. ప్రభుత్వం పరిశీలిస్తుంది. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను క్రోడీకరిస్తాం. సొసై టీ ద్వారా ఇవ్వాలనే ప్రతిపాదనపై న్యాయనిపుణులతో మరింత సుదీర్ఘ అభిప్రాయ సేకరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది’ అని చెప్పారు. ఈ సమాధానంపై యూనియన్ నాయకులు అక్కడికక్కడే ఆయన ఎదుటే తీవ్ర అభ్యంతరం తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడు తూ.. ‘జీవో 252తో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని భావిస్తే.. తక్షణ చర్యలు తీసుకుంటాం. అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తా’ అని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయ ణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు రామకృష్ణ, శెట్టి రజనీకాంత్, ఖమ్మం ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి రమేశ్‌బాబు ఉన్నారు.