డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్ హఠాన్మరణం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఆర్వో మధుసూదన్ గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం ఛాతినొప్పితో ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. దవాఖానలో కార్డియాక్ అరెస్టు కావడంతో అపోలో స్పెక్ట్రా దవాఖానకు తరలించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఆర్వో మధుసూదన్ గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం ఛాతినొప్పితో ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. దవాఖానలో కార్డియాక్ అరెస్టు కావడంతో అపోలో స్పెక్ట్రా దవాఖానకు తరలించారు. చికిత్స సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో మరణించారు. మధుసూదన్ స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి దిన పత్రికల్లో పనిచేశారు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సీపీఆర్వోగా సేవలందిస్తున్నారు. మధుసూదన్ మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నేత వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా మధుసూదన్ కృషి విశిష్టమైనదని హరీశ్‌రావు గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

