Telangana | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విద్యుత్తు సంస్థల్లో పదోన్నతుల పంచాయితీ తారాస్థాయికి చేరింది. విద్యుత్తు సంస్థలు, సర్కారు తీరును నిరసిస్తూ వివిధ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పదోన్నతులు ఇవ్వకుం డా బదిలీలు చేపడితే ప్రత్యక్ష కార్యాచరణ కు సిద్ధమని ఆయా ఉద్యోగ సంఘాలు అల్టిమేటం జారీచేశాయి.
ఇటీవలే విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. తొలుత పదోన్నతులు కల్పిం చి, ఆ తర్వాతే బదిలీలు చేపట్టాలని ఉద్యో గ సంఘాల నేతలు యాజమాన్యాలను కలిసి వినతిపత్రాలు సమర్పించాయి. కా నీ, ఇటీవల విద్యుత్తు సంస్థల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జరిపిన సమీక్షలో కేవలం బదిలీలపైనే చర్చించారు.
విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు ప్రస్తుతానికి పదోన్నతులను పకనబెట్టి బ దిలీలు చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నాయి. మొత్తం ఉద్యోగుల్లో 40 శాతం మందిని బదిలీ చేసేలా మార్గదర్శకాలను రూపొందించారు. ఈ లెక్కన ట్రాన్స్కోలో ఎలక్ట్రికల్లో 508, సివిల్లో 51, టెలికాంలో 45 మంది చొప్పున బదిలీ అవుతారని ఓ నివేదికను సైతం సిద్ధంచేశారు. మార్గదర్శకాలు విడుదలవుతాయని అ ంతా భావించగా, సంఘాల నేతల అభ్యంతరాలు, హెచ్చరికలతో మార్గదర్శకాల విడుదల నిలిచిపోయింది.
పదోన్నతులతో 25 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని సం ఘాల నేతలు పేర్కొంటున్నారు. జేఎల్ఎం క్యాడర్లో 5 వేల మంది, ఆఫీసర్, ఇంజినీర్ క్యాడర్లల్లో 2 వేల మంది, 15 వేల మంది ఆర్టిజన్స్కు గ్రేడ్ మారి పదోన్నతు లు దక్కుతాయి. పదోన్నతులు ఇచ్చేవరకు బదిలీల మార్గదర్శకాలను విడుదల చేయొద్దని అసోసియేషన్లు, సంఘాలు హెచ్చరించడంతో విద్యుత్తు సంస్థలు డోలాయమానంలో పడ్డాయి. పదోన్నతులు చేపట్టా లా? లేక బదిలీలు చేయాలా? అన్న విషయంపై తేల్చుకోలేక యాజమాన్యాలు సతమతం అవుతున్నాయి. మరోవైపు 1104, 327 వంటి ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.