హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ఏఐలో ఖమ్మం జిల్లాకు చెంది న బిడ్డ జాతీయ స్థాయిలో సత్తా చాటడం చాలా సంతోషంగా ఉన్నదని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఏఐ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో జాతీయ స్థాయిలో టాపర్గా నిలిచిన ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన తాల్లూరి పల్లవిని భట్టి అభినందించారు.
శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లోని కౌశల్ దీక్షాంత్ సమారోహ్లో ప్రధాని మోదీ చేతులమీదుగా పల్లవి జాతీయ అ వార్డు స్వీకరించడం గర్వకారణమన్నారు.