హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ): యాసంగిలో రైతుభరోసా కింద రూ.8,400 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఈ నెల 26న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. వనపర్తిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగు భూములన్నింటికీ ఎకరాకు ఏటా రూ.12 వేల చొప్పున అందించనున్నట్టు చెప్పారు.