Bhatti | గ్రామీణ ప్రాంతాల్లోని యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రతినియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి మల్లు విక్రమార్క అన్నారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కతో కలిసి సచివాలయంలో బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంఆ ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల కోచింగ్‌కు నిపుణులైన వారితో ఉచితంగా గ్రామీణ యువతకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. నాలుగు నెలల్లో ఈ నాలెడ్జ్ సెంటర్ల నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. యువత ఉపాధి లేక ఇబ్బందులుపడుతున్నారని. వారిని అలాగే వదిలేస్తే సమాజం ఇబ్బందిపడుతుందన్నారు. ఫీజు రీయింబ్స్‌మెంట్ పథకం అందుబాటులోకి రావడంతో వేలాది మంది బీటెక్ పూర్తి చేసి.. స్కిల్స్ లేక గ్రామాల్లోనే ఉండిపోతున్నారని.. ఆర్థికంగా ఉన్నవారు, తోడ్పాటు అందిన వారు విదేశాల్లో స్థిరపడుతున్నారన్నారు.
గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా మొదట పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని ఉపాధి కల్పన, మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చారు.. వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో వివరాలు సేకరించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలతో అనుసంధానం చేసుకొని ఉపాధి కల్పించే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా మిషన్ మిషన్ భగీరథ పథకం పనితీరుపై ఈ నెల 15 వరకు నివేదిక ఇవ్వాలని కోరారు. నివేదికను అందరు ఎమ్మెల్యేలకు అందజేసి ఇంటింటికి నీరు అందుతుందా? అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలన్నారు. మిషన్ భగీరథ నీటిని వినియోగించుకునే అంశం గ్రామసభల్లో ఓ ఎజెండాగా చేర్చాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి హరిత, పంచాయతీరాజ్ శాఖ అధికారులు దివ్య దేవరాజన్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.