హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్ వినియోగించే, అమ్మే కేసుల్లో ప్రముఖులు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ మూలాలను అరికట్టేందుకు ఈగల్ ఫోర్స్‌కు అధికారాలు ఇచ్చామని చె ప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, అక్రమ మానవ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన పా ల్గొన్నారు. హీరోలు, హీరోయిన్లు, నటులు, ప్రముఖ దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు డ్రగ్స్ నియంత్రణలో కలిసిరావాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్, డీజీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ రమేశ్, ఈగల్ ఫోర్స్ అధికారులు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.