Bhatti Vikramarka | హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సమష్ఠిగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరినీ తాము అడగడం లేదని, వారిలో కొందరు తమకు టచ్‌లో ఉన్నారని తెలిపారు.
గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పా యిజన్ ఘటనలపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నదని తెలిపారు. అ యితే ఇది కావాలని ఎవరూ చేయ డం లేదని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. రైతు భరో సా విధివిధానాలపై కసరత్తు జరుగుతున్నట్టు తెలిపారు. నిర్మల్‌లో ఇథనాల్ పరిశ్రమపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని చెప్పారు.