హైదరాబాద్, మార్చి 8(నమస్తే తెలంగాణ): మూసీ ప్రక్షాళనకు కేంద్రం సహకారం అందించడం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను రాబట్టడం కోసం శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన తదితర పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపారు. రాష్ర్టానికి లబ్ధి చేకూరేలా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. కాగా ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరయ్యారు.