హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై అనుసరించాల్సిన వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశానికి ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సీనియర్‌నేత జానారెడ్డి చర్చలు జరుపుతున్నారు.
శనివారం జనారెడ్డితో భట్టివిక్రమార్క భేటీ అయ్యారు. ఇప్పటికే డీలిమిటేషన్‌పై సలహాలు ఇవ్వాలంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని శనివారం పలు పార్టీల నేతలతో భట్టి మాట్లాడినట్టు తెలుస్తున్నది.