ఖమ్మం/మామిళ్లగూడెం, జనవరి 13 : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ఎత్తిపోతల పథకం కాలువ నిర్మాణ పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రూ.66.33 కోట్లతో నిర్మించనున్న ఎత్తిపోతలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్లో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు తదితర పథకాలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26 నుంచి అమలుచేయనున్న ఈ నాలుగు పథకాలకు రూ.45 వేల కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్టు భట్టి తెలిపారు.