WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. గత మూడు సీజన్లలో రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), తొలిసారి నాకౌట్‌కు దూసుకొచ్చిన గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. లీగ్ దశలో రెండుకు రెండు మ్యాచుల్లో ఢిల్లీపై గుజరాత్‌దే పైచేయి. కానీ, ఆఖరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసిన జెమీమా రోడ్రిగ్స్ బృందం ఈసారి ప్రతీకార విజయంతో ఫైనల్లో అడుగుపెట్టాలనుకుంటోంది. మరోవైపు అష్లీ గార్డ్నర్ జట్టు మాత్రం తగ్గేదేలే అంటోంది. సో.. ఎలిమినేటర్‌లో గెలిచి.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేది ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది.
గత సీజన్లలో ఏకపక్ష మ్యాచ్‌లకు భిన్నంగా జరుగుతున్న నాలుగో సీజన్లో రెండే రెండు మ్యాచ్‌లు మిగిలాయి. లీగ్ దశలో నువ్వానేనా అన్నట్టు తలపడిన గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఎలిమినేటర్ పోరుకు సిద్ధమయ్యాయి. ఆఖరి ఓవర్ వరకూ పోరాడి.. రెండుసార్లు స్వల్ప తేడాతో గుజరాత్ చేతిలో ఓడిన ఢిల్లీ.. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. గత మూడు సీజన్లలో ఒక్కసారి కూడా ఫైనల్ ఆడని గుజరాత్ జట్టు ఈసారి విదేశీ స్టార్ల మెరుపులతో నాకౌట్ వరకూ వచ్చింది. ఢిల్లీని ఓడించిందంటే తొలిసారి టైటిల్ పోరులో తలపడుతుంది.
That 𝗕𝗜𝗚 𝗚𝗔𝗠𝗘 feeling 🤩
A spot in the #TATAWPL 2026 Final on the line for @Giant_Cricket and @DelhiCapitals 🔥🙌#ClaimTheCrown | #Eliminator | #GGvDC pic.twitter.com/AcQCq337nR
— Women’s Premier League (WPL) (@wplt20) February 3, 2026
నాలుగో సీజన్‌ను ఘనంగా ఆరంభించిన గుజరాత్ జెయింట్స్ వరుసగా రెండు విజయాలతో ప్రత్యర్ధులను భయపెట్టింది. కానీ, ఆ తర్వాత వరుస ఓటములతో ప్లే ఆఫ్స్‌లో వెనకబడింది. అనంతరం ఢిల్లీపై, యూపీ, ముంబై ఇండియన్స్‌ను ఓడించిన గుజరాత్ రేసులోకి వచ్చింది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్… అదిరే ఆటతో ప్లే ఆఫ్స్ బరిలో నిలిచింది. చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ.. 8 పాయింట్లతో ఎలిమినేటర్‌కు అర్హత సాధించింది.
Two Sophie Devine magic last overs against DC this season ✨
They meet again in the Eliminator 🍿 pic.twitter.com/NzYxc7Uw8q
— ESPNcricinfo (@ESPNcricinfo) February 3, 2026
లీగ్ దశలో రెండు పర్యాయాలు ఛేదనలోనే ఢిల్లీపై గుజరాత్ నెగ్గింది. తొలి మ్యాచ్‌లో 205 పరుగులు చేసిన గార్డ్నర్ సేన ప్రత్యర్ధిని 201కే కట్టడి చేసింది. ఇక రెండో గేమ్‌లోనూ అంతే. 174 పరుగుల ఛేదనలో నిక్కీ ప్రసాద్, స్నేహ్ రానా మెరుపులతో గెలిచినంత పనిచేసిన ఢిల్లీ అనూహ్యంగా 3 పరుగులతో మ్యాచ్ చేజార్చుకుంది.
గుజరాత్ జెయింట్స్ బలం సోఫీ డెవినె. ఈ ఆల్‌రౌండర్ బ్యాటుతో, బంతితో విశేషంగా రాణిస్తోంది. 8 మ్యాచుల్లో 237 రన్స్ చేసిన డెవినె 17 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ఉంది. మిడిల్, డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రిస్తూ గుజరాత్‌ను గెలిపిస్తోందీ వెటరన్. అనుష్క శర్మ, బేత్ మూనీ, భారతి ఫుల్మాలి, తనూజ కన్వర్ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. బౌలింగ్ విషయానికొస్తే రేణుకా సింగ్, స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, వరేహం మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు.
Here’s a look at the Purple Cap leaderboard at the end of the league stage 🧢🙌
Will Sophie Devine retain the top spot? 🤔#TATAWPL | #ClaimTheCrown | #Eliminator pic.twitter.com/1tNf5oG17g
— Women’s Premier League (WPL) (@wplt20) February 3, 2026
ఢిల్లీ జట్టును మాత్రం నిలకడ లేమి వేధిస్తోంది. ప్రధాన పేసర్ మరిజానే కాప్ వరుసగా విఫలమైనా చివరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై సంచలన బౌలింగ్ చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, లీజెల్లీ లీలు శుభారంభాలు ఇస్తుండడం, డేంజరస్ లారా వొల్వార్డ్త్ గత మ్యాచ్‌లో 47తో ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు ప్లస్ అవుతోంది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్, నిక్కీ ప్రసాద్, స్నేహ్ రానాలు ఆఖర్లో దంచేశారంటే.. గుజరాత్‌పైనే హ్యాట్రిక్ తీసిన నందిని శర్మ(14 వికెట్లు), శ్రీ చరణి(14 వికెట్లు) ఈసారి చెలరేగితే ఢిల్లీని ఆపడం కష్టమే.
Today’s Dilli Daily, fueled by sweat, reps & playoff prep 💪😮💨💙 pic.twitter.com/DV50bsZEoA
— Delhi Capitals (@DelhiCapitals) February 3, 2026