Quran : ‘ఖురాన్ పఠనం పూర్తి అభినందనీయం’
ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఖురాన్ పఠనం పూర్తి చేసిన(ఖతం అల్-ఖురాన్/హిఫ్జ్) విద్యార్థులను మంగళవారం ఘనంగా సన్మానించారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి(డీఎండబ్ల్యూఓ) మహమ్మద్ ముజాహిద్ ముఖ్య అతిథిగా హాజరై..
– ఖమ్మం డీఎండబ్ల్యూఓ మహమ్మద్ ముజాహిద్
కారేపల్లి, ఫిబ్రవరి 03 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఖురాన్ పఠనం పూర్తి చేసిన(ఖతం అల్-ఖురాన్/హిఫ్జ్) విద్యార్థులను మంగళవారం ఘనంగా సన్మానించారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి(డీఎండబ్ల్యూఓ) మహమ్మద్ ముజాహిద్ ముఖ్య అతిథిగా హాజరై పవిత్ర ఖురాన్ పారాయణాన్ని పూర్తిచేసిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేసి వారి కృషిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే ఖురాన్ నేర్చుకున్న విద్యార్థులను అభినందించడం ద్వారా వారిలో ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు.
విద్యార్థులు ఆధునిక విద్యను అభ్యసిస్తూనే ఖురాన్ కంఠస్థం చేయడం అభినందనీయమన్నారు. ఖురాన్ పూర్తి చేయడం అనేది విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుందన్నారు. అంతకుముందు విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా తయారు చేసి ప్రదర్శించిన ఆవిష్కరణలను ఆయన వీక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి.సావిత్రి, అరబ్ ఉపాధ్యాయురాలు మీరా సుల్తానా, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రాణి, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

