Harish Rao | గురుకులాలు విద్యా నిలయాలా..? విషసర్పాలకు ఆవాసాలా..? విద్యార్థిని పూర్తి బాధ్యత రేవంత్దే : హరీష్ రావు
Harish Rao | మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతుందన్న ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. విద్యార్థిని పాము కాటుకు గురైన వార్త తనను ఎంతో కలిచివేస్తోందన్నారు.
Harish Rao | ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల సంగతి దేవుడెరుగు.. ఉన్న గురుకులాల పరిస్థితి అధ్వాన్నం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పాము కాటుకు గురై ఆస్పత్రిలో చేరిన గురుకుల విద్యార్థిని ప్రాణానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతుందన్న ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. విద్యార్థిని పాము కాటుకు గురైన వార్త తనను ఎంతో కలిచివేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి గారు మీ పాలనలో గురుకులాలు విద్యా నిలయాలా..? లేదంటే విషసర్పాలకు ఆవాసాలా..? అని హరీష్ రావు ప్రశ్నించారు.
సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా…? రూ.20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెబుతూ రంగుల లోకం చూపిస్తూ గురుకులాలను మీరు గాలికి వదిలేయడం సిగ్గుచేటన్నారు. గురుకులాల్లో పిచ్చి మొక్కలు తొలగించే దిక్కులేదు. చిమ్మచీకట్లో లైట్లు వేసే నాథుడు లేడు. అపరిశుభ్రత కారణంగా గురుకులాల్లో నేడు కుక్కకాట్లు, పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోవడం అత్యంత దుర్మార్గమైన విషయమన్నారు.
గురుకుల బిడ్డలకు కడుపునిండా తిండి లేదు.. ప్రాణాలకు రక్షణ లేదన్నారు. సీఎం హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫొటోలకు పోజులిస్తే ఇక్కడ పేద విద్యార్థులు ఆస్పత్రి పాలై కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారా..? లేక చావుతో పోరాడేందుకు వెళ్తున్నారా..? అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలి. రాజకీయ కక్షసాధింపుల మీదున్న శ్రద్ధలో కొంతైనా పేద పిల్లల బతుకుపై పెట్టండని విజ్ఞప్తి చేశారు.
హార్వర్డ్ లో సీఎం కాస్ట్లీ చదువు.. గురుకుల విద్యార్థులకు పాము కాట్లు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంగతి దేవుడెరుగు ఉన్న గురుకులాల పరిస్థితి అధ్వాన్నం చేశారు.
పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరిన గురుకుల బిడ్డ ప్రాణానికి రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి… pic.twitter.com/hWjy5z2Cog
— Harish Rao Thanneeru (@BRSHarish) February 3, 2026
Read Also :
Jagthyal | జగిత్యాల మున్సిపల్ పోరులో జీవన్ రెడ్డి vs సంజయ్
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

