హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) డ్రాఫ్టింగ్ కమిటీని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు చోటుదక్కింది. ఈ కమిటీని ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగనున్న ఏఐసీసీ కీలక సమావేశాల కోసం ఏర్పాటుచేశారు. ఏప్రిల్ 8న సీడబ్ల్యూసీ సమావేశం, 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు.