Telangana | హైదరాబాద్, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): భూమిలేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. 28 నుంచి కూలీలకు తొలి విడతగా 6 వేల చొప్పు న ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కూలీలను ఏ ప్రాతిపదికన గుర్తిస్తారు? ఇందులో అర్హులను ఎలా ఎంపిక చేస్తారు? అందరికీ ఇస్తా రా? లేక కోతలు పెడతారా? ఒకవేళ కోతలు పెడితే వారిని ఏ ప్రాతిపదికన అనర్హులుగా ప్రకటిస్తారు. అసలు ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంత మంది కూలీ లు ఉన్నారో తేల్చారా? వంటి అనే ప్రశ్నలు, సందేహాలు వ్యక్తమవుతున్నా యి. పథకాల అమలులో కాంగ్రెస్ మార్క్ కోతలు, కొర్రీలు ఈ పథకంలోనూ కొనసాగుతాయనే అనుమానా లు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో 53 లక్షల ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందులో 1.10 కోట్ల మంది కూలీలు ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. హామీ మేరకు ఉపాధి కూలీలు 1.10 కోట్ల మందికి ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తారా? లేదా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి ఏటా 3,200 కోట్లు అవసరం అవుతాయి. రెండు దశల్లో అరు నెలలకు 6 వేల చొప్పున పంపిణీ చేసినా రూ.6,600 కోట్లు అవసరం అవుతాయి. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి కూలీలకు సాయం అందిస్తుందా? అనే ప్రశ్నలు వినిస్తున్నాయి.
కూలీలకు, కౌలు రైతులకు, రైతుల కు వీరిలో ఒకరికి ఒకే పథకం కింద సాయం అందుతుందని సీఎం రేవంత్గతంలోనే ప్రకటించారు. భూమిలేని ఉపాధి కూలీలు ఓవైపు కూలీ చేసుకుంటూనే మరోవైపు భూమిని కౌలు తీసుకొని వ్యవసాయ చేస్తున్నారు. వీరిని ఏ విభాగంలో పరిగణిస్తారనేది ప్రశ్నగా మారింది. కౌలు రైతులకు ‘రైతు భరో సా’ ఇవ్వడం లేదనే చర్చ సాగుతున్న ది. కౌలు రైతులను కూడా కూలీల విభాగంలో పరిగణించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.