తిమ్మాజిపేట, జనవరి 12 : ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో రూ.3.45 కోట్లతో నిర్మించనున్న 33/ 11 కేవీ సబ్‌స్టేషన్‌కు ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, ఎంపీ మల్లు రవితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు అభివృద్ధికి రానున్న ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేసి నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా కృష్ణానీటిలో ప్రతిచుక్కను ఒడిసిపట్టి తాగునీటితోపాటు 12లక్షల ఎరకాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్‌తోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.