హైదరాబాద్ : సింగరేణి సంస్థకు ఒడిశా(Odisha) రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్‌కు(Naini Coal Block) సంబంధించి ఇంకా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి నాలుగు నెలల్లో గని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti) సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం సచివాలయంలో నైనీ బొగ్గు బ్లాకు పై ఇంధన శాఖ కార్యదర్శిరోనాల్డ్ రోస్, సింగరేణి ఎన్.బలరామ్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ, కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలన్నారు. స్థానికు ల సంక్షేమాన్నిదృష్టిలో ఉంచుకొని పని చేయాలని సూచించారు. నైనీ బొగ్గు బ్లాక్‌కు ఇప్పటికే అన్ని అనుమ తులు లభించాయి. ఈ నేపథ్యంల సింగరేణికి ఆ రాష్ట్ర అటవీశాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు, తదుపరి ఆ స్థలం అప్పగింత పై ఒడిశా ముఖ్య మంత్రి సాను కూలంగా స్పందించారు.
కావున ఆ రాష్ట్ర అటవీశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఈ పనులు వేగంగా పూర్తయ్యేలా చొరవ చూపాలని ఆయన సింగరేణి సంస్థను ఆదేశించారు. అలాగే నిర్వాసిత గ్రామ ప్రజలకు మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, సీఎస్ఆర్ పనులు, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కాలక్రమ ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.