హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో లైసెన్స్డ్ గన్స్‌ను ఈ నెల 16వ తేదీలోగా ఆయా పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చే యాలని పోలీస్‌శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిపాజిట్ చేసిన ఆయుధాలను డిసెంబర్ 10వ తేదీ నుంచి తిరిగి పొందవచ్చని తెలిపింది.
ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఆయుధాలు డిపాజిట్ చేయకుంటే వారిపై ‘ఆయుధాల చట్టం 1959’ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల వేళ జాతీయ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల భద్రతా సిబ్బంది, క్రీడాకారులకు మి నహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించింది.