హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పలు జిల్లా డీఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఐఏఎస్లకు సర్కారు బాధ్యతలప్పగించింది. జిల్లా అదనపు కలెక్టర్లకు డీఈవోలుగా అదనపు బాధ్యతలప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది. కుమ్రం బీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారిని అదే జిల్లా డీఈవోగా, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బు గుప్తాను అదే జిల్లా డీఈవోగా, జనగాం అదనపు కలెక్టర్ పర్మార్ పింకేష్కుమార్ లలిత్కుమార్కు అదే జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలప్పగించారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీఈవో పోస్టులు ఖాళీ కాగా, అక్కడి అధికారులకు అదనపు బాధ్యతలప్పగించే అవకాశమున్నట్టు తెలిసింది.