రాష్ట్రంలో పలు జిల్లా డీఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఐఏఎస్లకు సర్కారు బాధ్యతలప్పగించింది. జిల్లా అదనపు కలెక్టర్లకు డీఈవోలుగా అదనపు బాధ్యతలప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది.
నూతన జిల్లాలకు డీఈవో పోస్టులను వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.