హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): నూతన జిల్లాలకు డీఈవో పోస్టులను వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. వరంగల్‌లో ఆదివారం నిర్వహించిన సంఘం రాష్ట్రస్థాయి సమావేశంలో కీలక అంశాలపై తీర్మానాలు చేసింది.
317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని, ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్‌ను తీసుకొని ఈహెచ్ఎస్ను వెంటనే అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్‌చేశారు. సమావేశంలో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములు గు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కార్యకర్తలు పాల్గొన్నారు.
భాషాపండితులను అప్‌గ్రేడ్ చేయాలి.. ప్రభుత్వాన్ని కోరిన ఆర్‌యూపీపీ
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : భాషాపండితుల అప్‌గ్రేడేషన్‌లో మిగిలిపోయిన పండిట్లను సైతం అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్రీ య ఉపాధ్యాయ పండిత పరిషత్తు(ఆర్‌యూపీపీ) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. మిగిలిపోయిన తెలుగు, హిందీ, ఉర్దూ పోస్టుల్లోనూ పదోన్నతు లు కల్పించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి తిరుమల కాంతికృష్ణ కోరారు.
సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాషాపండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడం తో పాఠశాలలు బలోపేతమయ్యాయ ని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాల లో తెలుగు, హిందీ భాషా టీచర్ పోస్టులను మంజూరుచేయాలన్నారు.