హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): డెంటిస్ట్లకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేసేందుకు అనుమతి లేదని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది. గురువారం ఎన్ఎంసీ మార్గదర్శకాల ఆధారంగా ప్రకటన జారీ చేసింది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కాస్మెటిక్ ప్రొసీజర్లు నిర్వహించవద్దని నిర్దేశించింది. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
బీడీఎస్, ఎండీఎస్ వైద్యులు ఓరల్, మాక్సిలోఫేషియల్ ఆపరేషన్లు మాత్రమే చేయవచ్చని సూచించింది. అర్హత లేని వైద్యులు ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.