మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 9 : మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బారినపడ్డారు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డెంగ్యూ పాజిటివ్ అని తేలింది. ప్లేట్లెట్స్ 32వేలకు పడిపోయినట్టు వైద్యు లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లినట్టు తెలిసింది. తెలంగాణ టూరిజం డైరెక్టర్ ఇలా త్రిపాఠిని మంచిర్యాల ఇన్చార్జి కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది.