బంజారాహిల్స్, ఏప్రిల్ 1 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘హెచ్‌సీయూ భూముల్లోని అటవీ సంపదను నరికివేస్తే హైదరాబాద్ ఊపిరి ఆగుతుంది’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హెచ్‌సీయూ భూములను కాపాడాలి, జీవ వైవిధ్యాన్ని రక్షించాలి’ అని బీఆర్ఎస్వీ నాయకులు నినదించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మణిశర్మతోపాటు పలువురు వాకర్లు ప్రదర్శనలో పాల్గొన్నారు.