చిగురుమామిడి, మే 4: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతుల కోసం వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పంటల బీమా పథకాన్ని తెస్తామని గతంలో ఎన్నోసార్లు ప్రకటనలు చేసిందని, ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాతీయ విపత్తు కింద ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు.