దివ్యాంగులకూ ఫ్రీ బస్ జర్నీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం దివ్యాంగులకూ వర్తింపజేయాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి కోరారు. ఈ విషయమై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
- సౌకర్యం కల్పించాలి: వాసుదేవరెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం దివ్యాంగులకూ వర్తింపజేయాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి కోరారు. ఈ విషయమై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సమాజంలో వెనుకబడి ఉన్న దివ్యాంగులను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వివరించారు.
రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. 50 శాతం రాయితీ బస్‌పాస్ కలిగి ఉన్న దివ్యాంగులకు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వానికి పెద్ద భారం కూడా పడదని పేర్కొన్నారు. మహిళలతోపాటు దివ్యాంగులకూ ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మానవీయ కోణంలో అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

