1న ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో జూన్ 1 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని(సీఎం ఇల్లు) ముట్టడించనున్నట్టు మాజీ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ప్రకటించారు.
- మాజీ సర్పంచుల సంఘం జేఏసీ పిలుపు
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో జూన్ 1 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని(సీఎం ఇల్లు) ముట్టడించనున్నట్టు మాజీ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ప్రకటించారు. గన్పార్ అమరవీరుల స్థూ పం వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని గవర్నర్‌కు, అనేకసార్లు మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ప్రయోజనం లేకుండా పో యిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజావాణిలో 11 సార్లు వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిషారం కానందున సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. బిల్లులు రావాల్సిన వారు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, నాయకులు వై అరవింద్‌రెడ్డి, ఆనబోయిన సుధాకర్, గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గంధం మల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

