Delhi CM | హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటం చేసేందుకు విపక్షాల మద్దతు కూడగడుతున్నారు ఢిల్లీ సీఎం. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అరవింద్ కేజ్రీవాల్ శనివారం భేటీ కానున్నారు.
ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌ను పార్లమెంట్లో వ్యతిరేకించాలని విపక్షాలను కేజ్రీవాల్ కోరుతున్నారు. ఈ విషయమై కేజ్రీవాల్ ఇప్పటికే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరేలతో కలిసి చర్చించారు.
Meeting Hon’ble CM of Telengana tomo in Hyderabad to seek support against unconstitutional and undemocratic ordinance passed by BJP govt against the orders of Hon’ble SC.
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 26, 2023