హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): హస్తినాపురిలో తెలంగాణ అస్తిత్వ పతాక.. తెలంగాణ ఆత్మగౌరవ బావుటాగా బీఆర్ఎస్ భవన్ రూపుదిద్దుకున్నది. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని వచ్చేనెల 4న ప్రారంభించబోతున్నామని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం తెలంగాణభవన్‌లో జరిగిన ప్రతినిధుల సభలో వెల్లడించారు. పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేసిన వెంటనే నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. 29 నెలల కాలంలోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి బీఆర్ఎస్ మరోసారి రికార్డు నెలకొల్పింది. ఢిల్లీ వసంత్‌విహార్‌లో 1100 చదరపు మీటర్ల సువిశాల ప్రాంగణంలో బీఆర్ఎస్ భవన్ ప్రారంభానికి తుది మెరుగులు దిద్దుకుంటున్నది. దేశ రాజకీయాలను తన వెంట నడిపించి.. స్వరాష్ట్ర సంకల్పాన్ని నెరవేర్చిన బీఆర్ఎస్ పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరోసారి ఢిల్లీగడ్డపై గులాబీ జెండా ఎగురవేయబోతున్నారు. హైదరాబాద్‌లో 17 ఏండ్ల క్రితం నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్) ఉద్యమ సమయంలో తెలంగాణ వాదానికి కేంద్రబిందువుగా ఏ విధంగా మారిందో అదే స్ఫూర్తితో జాతీయస్థాయిలో ఢిల్లీ వసంతవిహార్లోని బీఆర్ఎస్ భవన్.. దేశంలో గుణాత్మక మార్పునకు కేంద్రం కానున్నది. ఢిల్లీలోని సర్దార్ పటేల్‌రోడ్‌లో బీఆర్ఎస్ తాత్కాలిక జాతీయ కార్యాలయాన్ని డిసెంబర్ 14, 2022న సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
జీ ప్లస్ త్రీ
ఢిల్లీ వసంతవిహార్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ చిహ్నంగా రూపుద్దిద్దుకున్నది. 22,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ త్రీ విధానంలో ఈ భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్, కార్యాలయ కార్యదర్శి, మేనేజర్, చాంబర్లతోపాటు మీటింగ్ హాల్ ఉం టుంది. మొదటి అంతస్థులో పార్టీ అధ్యక్షుడి చాం బర్, యాంటీ రూం, కాన్ఫరెన్స్‌హాల్, వెయిటింగ్హాల్స్ నిర్మించారు. రెండో అంతస్థులో డార్మెటరీ రూంలు, నేతల బసకోసం ప్రత్యేక సూట్స్, మూడో అంతస్థులో ప్రత్యేక గదులు, సూట్స్ నిర్మించారు.
శాశ్వత కార్యాలయ నేపథ్యం ఇదీ
ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మించాలని బీఆర్ఎ అధినేత, సీఎం కేసీఆర్ 2004లోనే యోచించారు. నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రాంతీయపార్టీలకు స్థలాలను కేటాయించారు. ఢిల్లీలో స్థలాలను కేటాయించాలంటే కనీసం ఐదుగురు ఎంపీలు ఉంటే 500 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తారు. 15 మందికి పైగా ఉంటే 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తారు. అయితే, బీఆర్ఎస్కు 2004లో ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉండటంతో కేసీఆర్ ఆ సమయంలో కార్యాలయం కోసం స్థలాన్ని వాయిదావేశారు. పార్టీకి ప్రస్తుతం 16 మంది ఎంపీలున్నారు. వెయ్యిగజాల స్థలం కేటాయించడానికి నిబంధనలు అంగీకరిస్తాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలు స్థలాలను పరిశీలించిన అనంతరం వసంత్‌విహార్‌లో స్థలాన్ని ఎంపిక చేశారు.
చరిత్రలో నిలిచిపోతుంది:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఢిల్లీలో నూతన బీఆర్ఎస్ భవనం తెలంగాణ ఆత్మగౌరవ, అస్థిత్వ చిహ్నం. తెలంగాణ ఉద్యమ చరిత్రతోపాటు బీఆర్ఎస్ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోతుంది.
–పార్టీ కార్యాలయ భూమిపూజ సందర్భంగా ( సెప్టెంబర్ 2, 2021న)
గర్వంగా ఉన్నది
ఢిల్లీ నడిబొడ్డున పార్టీ కార్యాలయానికి జరిగిన భూమిపూజ పత్రాల స్వీకరణ దగ్గర నుంచి భూమిపూజ, ఆ తరువాత వివిధ సందర్భాల్లో ఢిల్లీకి వెళ్లి నిర్మాణ పనులు పరిశీలించే భ్యాగం దక్కినందుకు గర్వంగా ఉన్నది. పార్టీ కార్యాలయ భవనం నమూనాలకు అనుగుణంగా, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు నిర్మాణ పనుల్లో భాగం పంచుకోవటం జీవితంలో మరచిపోలేని అనుభూతి.
– మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
ఢిల్లీ బీఆర్ఎస్ భవన్
స్థలం: వసంతవిహార్
విస్తీర్ణం: 1100 చదరపు మీటర్లు (1327 చదరపు గజాలు) స్థలానికి బీఆర్ఎస్ పార్టీ చెల్లించిన మొత్తం: రూ.8.64 కోట్లు
భవనం: జీ ప్లస్ త్రీ
నిర్మాణ విస్తీర్ణం: 22,300 చదరపు అడుగులు
నిర్మాణం సాగిందిలా..