TG TET 2024-II | హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) షెడ్యూల్ను సోమవారం విడుదల చేసింది. మంగవారం సమగ్ర నోటిఫికేషన్ను విడుదల చేస్తామ ని, వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చే సుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా మంగళవారం ఉదయం నుంచే దరఖాస్తు చేసేందు కు ప్రయత్నించారు. టెట్ వెబ్సైట్ను ఓపెన్ చేస్తే అప్లికేషన్ విండో ప్రత్య క్ష్యం కాలేదు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను విడుదల చేయలేదు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆఖరుకు ఈ నెల 7న ఇన్ఫర్మేషన్ బులిటిన్, నోటిఫికేషన్ను విడుదల చేస్తామని, అభ్యర్థులు ఆ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ తెలిపారు.
ఇంటర్ పరీక్ష ఫీజు పెంపు ; నేటి నుంచి 26 వరకు స్వీకరణ ఆలస్య రుసుముతో డిసెంబర్ 27 వరకు
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): నిరుటితో పోల్చితే ఇంట ర్ వార్షిక పరీక్షల ఫీజులు స్వల్పంగా పెరిగాయి. ఫస్టియర్ పరీక్ష ఫీజు నిరు డు రూ.510 ఉంటే.. ఈసారి రూ. 520కి పెరిగింది. రూ.730 ఉన్న సె కండియర్ ఫీజును రూ.750కి పెరిగిం ది. ఇంటర్ పరీక్ష ఫీజును చెల్లించేందుకు ఈ నెల 6 నుంచి 26 వరకు గడువు ఇచ్చారు. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 4 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11 వరకు, రూ. వెయ్యి ఆలస్య రుసుముతో డిసెంబర్ 18 వరకు, రూ. రెండు వేల ఆలస్య రుసుముతో డిసెంబర్ 27 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశమిచ్చారు.