మరికల్, జూన్ 16 : వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడి జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలకరి కురిసిన వెంటనే చాలామంది రైతులు విత్తనాలు విత్తుకున్నారు. ప్రస్తుతం వానలు లేకపోవడంతో అవి భూమిలోనే మురిగిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన రైతు తిరుపతయ్య 14 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటాడు. 15 రోజులు దాటినా వాన రాకపోవడంతో ఎలాగైనా పంటను కాపాడుకోవాలని ట్రాక్టర్ వెనుకాల వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి పంటకు నీటి తడి అందిస్తున్నాడు.