చిన్నశంకరంపేట, అక్టోబర్ 5 : మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్‌కు చెందిన కుమ్మరి శ్యామ్, పుష్పలత దంపతుల కుమారుడు కుమ్మరి ప్రభాస్ (20) కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. పది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు.
ఇంటికి వచ్చి మెదక్‌లోని ప్రైవేట్ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకోగా, డెంగీ నిర్ధారణ అయ్యింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని సూచించారు. నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు.