హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్ర సగటు వర్షపాతం ఆశాజనకంగా ఉన్నా కొన్ని జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆగస్టు మొదటి వారం ముగిసే వరకు కామారెడ్డి, జనగామ, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్మల్కాజిగిరి, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్1 నుంచి మంగళవారం వరకు సాధారణ వర్షపాతం 401.8 మి.మీ ఉండగా, సగటు వర్షపాతం 487.4 మి.మీగా నమోదైంది. ఆగస్టు మొదటి వారం వరకు 40 మండలాల్లో-20 నుంచి-59 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
8 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. జూలై రెండో వారం నుంచి కురుస్తున్న ఓ మోస్తరు వానలతో పరిస్థితి ఆశాజనకంగా మారినా ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో కరువు ఛాయలే నెలకొన్నాయి. 43 మండలాల్లో 60 శాతం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. 18 జిల్లాల్లో అధిక వర్షపాతం (+20 నుంచి+59 శాతం), 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం(+19 నుంచి-19 శాతం) నమోదైనట్టు వెల్లడించింది. వీటిలో 18 జిల్లాల్లోని 230 మండలాల్లో 20 నుంచి 59 శాతం కంటే అధిక వర్షపాతం నమోదవగా, మరో 15జిల్లాల్లోని 299 మండలాల్లో +19 నుంచి -19 శాతం నమోదైంది.
31