హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగా ణ): కాంగ్రెస్ హయాంలో నిత్యం ఏదో ఒక కుంభకో ణం జరిగేదని దీంతో దేశానికి లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని రక్షణ శాఖ మంత్రి రాజనాథ్సింగ్ ధ్వజమెత్తారు. సికింద్రాబాద్‌లోని సిఖ్ విలేజ్‌లో శుక్రవారం మేధావులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో బొగ్గు, 2జీ, కామన్వెల్త్ కుంభకోణాలు జరిగాయని మండిపడ్డారు. సమగ్రత, స్పష్టమైన ఉద్దేశం, పనిచేసే సామర్థ్యం, సాధించాలనే తపన ఉన్నవారే నాయకులు కాగలుగుతారని వివరించారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, 5 వందే భారత్ రైళ్లను ఇవ్వడంతోపాటు అమృ త్ భారత్ రైళ్లను మంజూరు చేసిందని చెప్పారు. అంతకుముందు తెలుగు రాష్ర్టాలకు చెందిన పలువురు క్రీడాకారులు, సినీ ప్రముఖులు, కీలక వ్యక్తులతో ఆయన భేటీ ఆయ్యారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ కిడాంబి, ఒలింపిక్ షూటర్ ఇషా సింగ్, నటులు తేజా సజ్జా, అడివి శేష్ తదితరులు రాజ్‌నాథ్‌ను కలిసినవారిలో ఉన్నారు. అంతకుముందు రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు సాదర స్వాగతం పలికారు.