హైదరాబాద్, డిసెంబర్3 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ జిల్లాల వారీగా బహిరంగ విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి అభ్యంతరాలను స్వీకరించారు. 5వ తేదీన నిజామాబాద్, 6న ఆదిలాబాద్, 7న కరీంనగర్లో బహిరంగ విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు కమిషన్ కార్యాలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా ఉమ్మడి జిల్లాల ప్రజలు విచారణలో పాల్గొని రిజర్వేషన్లపై తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను వెల్లడించవచ్చని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అందించేందుకు గడువు నేటి (బుధవారం)తో ముగియనుంది.
బడ్జెట్‌పై ఆర్థికశాఖ కసరత్తు!
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ తయారీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీచేసింది. ఉప ము ఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టి విక్రమార జనవరి మొదటి వారంలో వివిధ శాఖలతో సం ప్రదింపులు నిర్వహించే అవకాశాలు ఉన్నా యి. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ వచ్చే ఫిబ్రవరిలో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. గతేడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్ర మే ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థి క సంవత్సరంలో కొన్ని శాఖలకు తగిన ని ధులు కేటాయించకపోవడం, కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించుకోలేకపోయిన పరిస్థితులు కనిపించాయి. ఇప్పటివరకు ఎంత ఆదాయం వస్తున్నది? దానిని ఎంత వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి? అనే కోణంలో వివరాలు సమర్పించాలని ఆయా శాఖలను ఆర్థికశాఖ కోరినట్టు సమాచారం. వానకాలం శాసనసభ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రా రంభం కానున్నాయి. ఆ తర్వాత బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారిక సంప్రదింపులు జనవరి మొదటి లేదా రెండో వారంలో ప్రారంభం కా వచ్చని తెలిసింది. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యం సాధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధాన సవాల్‌గా మారనున్నది.