Telangana | హైదరాబాద్, మే 16 (నమస్తేతెలంగాణ): తెలంగాణలో పశుసంపద తగ్గింది. ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు తగ్గాయి. నాటుకోళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నది. కేంద్రం నిర్వహించిన 21వ జాతీయ పశుగణనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2019లో జరిగిన 20వ పశుగణనతో పోలిస్తే తెలంగాణలో పశుసంపద తగ్గినట్టు తేలింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో పశుగణన జరిగింది. తర్వాత 2019లో చేపట్టిన పశుగణన నాటికి 512.06 మిలియన్ల నుంచి 535.82 మిలియన్లకు పశువుల సంఖ్య పెరిగింది. ఈ సారి తగ్గుదలను అధికారులు గుర్తించారు.