హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ఆర్టీసీపై క్రమంగా రుణభారా న్ని తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించా రు. నూతన బస్సుల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఆర్టీసీ అధికారులతో సీఎం స మీక్ష సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మి పథకం ద్వారా 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, మహిళా ప్రయాణికులకు రూ.2,840.71 కోట్లు ఆదా అయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. అనంతరం వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కలిపి రూ.6,322 కోట్ల రుణాలు ఉన్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, సీఎం కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీం, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను నియమించవద్దని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు ఆర్టీసీని ఆదుకునే కార్యక్రమాలను చేపట్టాలని ఎన్ఎంయూరాష్ట్ర అధ్యక్షుడు పీ కమాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్రి నరేందర్ డిమాండ్ చేశారు.