NHAI | అప్పుల కుప్ప ఎన్హెచ్ఏఐ.. మోదీ హయాంలో భారీగా పెరిగిన రుణభారం
NHAI | రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతున్నది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అప్పుల కుప్పగా మారిపోయింది. గత తొమ్మిదేండ్లలో ఈ అప్పుల భారం 14 రెట్లు పెరిగింది.
- తొమ్మిదేండ్లలో ఏకంగా 14 రెట్లు అధికం
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.32,440 కోట్ల వడ్డీ చెల్లింపు
- 2028 నాటికి వడ్డీభారం రూ.53 వేల కోట్లకు చేరే అవకాశం
- ఆపై వడ్డీ చెల్లింపులకు ఆస్తులు అమ్ముకోవాల్సిందే
NHAI | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతున్నది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అప్పుల కుప్పగా మారిపోయింది. గత తొమ్మిదేండ్లలో ఈ అప్పుల భారం 14 రెట్లు పెరిగింది. దీంతో ఆ రుణాలకు వడ్డీలు చెల్లించేందుకు రోడ్లు, ఇతర ఆస్తులను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తమ హయాంలో జాతీయ రహదారులను గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ సర్కారు.. అసలు నిజాలను మాత్రం ప్రజల ముందు ఉంచడంలేదు. ‘అప్పుచేసి పప్పు కూడు’ అన్నట్టు విపరీతంగా అప్పులు చేసి రోడ్లను నిర్మిస్తున్నది. ఆ రోడ్లను నిర్మిస్తున్న ఏజెన్సీలకు గతంలో ఎన్నడూ లేనంతగా రాయితీలు ఇవ్వడంతోపాటు భారీగా టోల్ట్యాక్స్లు విధించి ప్రజల నడ్డి విరుస్తున్నది.
మోదీ హయాంలో బడ్జెటేతర రుణాలు ఏకంగా 14 రెట్లు పెరిగాయి. 2014-15లో రూ.24,118 కోట్లుగా ఉన్న ఈ రుణాలు 2023-24లో రూ.3,49,200 కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో డెట్ సర్వీసింగ్ (రుణాలు, వడ్డీ చెల్లింపులు) 5 నుంచి 20 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఏకంగా రూ.32,440 కోట్ల వడ్డీ చెల్లించింది. 2028 నాటికి ఇది రూ.53 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. దీంతో వడ్డీ చెల్లింపుల కోసం ఎన్హెచ్ఏఐ తన ఆస్తులను విక్రయించడమో, లేక లీజుల పేరుతో ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడమో తప్పదు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో జరిగే జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలు 60 నుంచి 70 శాతం మేరకు, ఎన్హెచ్ఏఐ 30-40 శాతం మేరకు నిధులను సమకూరుస్తున్నాయి. దీంతో ప్రైవేట్ ఏజెన్సీలకు కేంద్రం భారీగా రాయితీలను అందించి ఆ భారాన్ని టోల్ట్యాక్స్ల రూపంలో వాహనదారులపై మోపుతున్నది.
రోడ్లు నిర్మాణ కాంట్రాక్టర్లకు ఇస్తున్న రాయితీలు
- 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి.
- మూలధన లాభాల పన్ను నుంచి ఎన్హెచ్ఏఐ బాండ్లకు మినహాయింపు.
- 30 సంవత్సరాల వరకు అధిక రాయితీల గడువు.
- ఆదాయ పన్నుపై 10 ఏండ్ల వరకు 100% రాయితీ.
- నిర్మాణ ఏజెన్సీలకు నష్టం సంభవిస్తే భరించేందుకు రిస్క్ షేరింగ్ విధానం.
- వాహనదారుల నుంచి భారీగా టోల్ వసూలు చేసుకునేలా నిర్మాణ ఏజెన్సీలకు అనుమతి.

06

07
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

