హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ప్రభుత్వం మరో 10 రోజులు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20లోగా బదిలీలను ముగించాలని ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ, వివిధ కారణాలతో ఆయా శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఆయా శాఖల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు బదిలీలను పూర్తిచేయాలని ఆదేశించారు.