పెద్దపల్లి : పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు(Heavy rains) జనజీవనం స్తంభించి పోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు దాటే క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట బిల్ కలెక్టర్(Bill collector) చెప్యాల పవన్ వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. మల్యాల-మీర్జంపేట వెళ్లే మార్గంలోవాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా వాగు దాటే క్రమంలో పవన్ వరదలో చిక్కుకుని కొట్టుకుపోయాడు. రెస్క్యూ టీం, పోలీసులు, గ్రామస్తులు శ్రమించి పవన్ మృత దేహాన్ని ఎట్టకేలకు బయటికి తీశారు. పవన్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.