గంభీరావుపేట, జూన్ 12: ఇద్దరు యువకులు బయటి దేశానికి వెళ్లడానికి వీసా కోసం ఇంటర్వ్యూకు వెళ్తుండగా.. ఓ డీసీఎం బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో గల్ఫ్‌కు వెళ్లాలన్న వారి ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బి క్నూర్ మండలం మల్లుపల్లికి చెందిన షే క్అబ్దుల్లా(32), సయ్యద్‌చాంద్(38) కూలి పని చేసేవారు.
మస్కట్‌కు వె ళ్లేందుకు వీసా ఇంటర్వ్యూ కోసం బుధవారం ఉదయం మల్లుపల్లి నుంచి సిరిసిల్లకు బైక్‌పై బయలుదేరారు. గంభీరావుపేట మండలం కామారెడ్డి-సిరిసిల్ల ప్రధాన రహదారి పెద్దమ్మ అటవీ ప్రా ంతానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న డీసీఎం బైక్‌ను ఢీకొట్టింది. అబ్దుల్లా, చాంద్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో మల్లుపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామ్మోహన్ తెలిపారు.