Bank Loan | కొడకండ్ల, ఫిబ్రవరి 12: గేదెల కోసం లోన్ తీసుకొని కట్టడం లేదని బ్యాంకు అధికారులు రుణగ్రస్థురాలి ఇంటి గేటును తీసుకెళ్లిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మద్దెబోయిన ప్రేమలత ఐదుగురు గ్రూపు సభ్యులతో కలిసి స్టేషన్ ఘన్పూర్ డీసీసీ బ్యాంకులో 2021లో రూ. 6 లక్షల లోన్ తీసుకున్నారు. రూ.3 లక్షల మేర చెల్లించి, మిగతా నగదు కట్టకపోవడంతో బుధవారం స్టేషన్ ఘన్పూర్ బ్యాంకు అధికారులతోపాటు మండల కేంద్రానికి చెందిన డీసీసీబీ అధికారులు ఏడునూతుల గ్రామానికి వచ్చి రుణం కట్టని ఇండ్లకు వెళ్లి అడిగారు.
నోటీసులు పంపినా లోన్ కట్టకపోవడంతో అధికారులు ఆగ్ర హం వ్యక్తం చేస్తూ గేటును బాధితురాలి భర్తతోనే ఊడబీకించి ట్రాక్టర్లో వేయించారు. ఐదుగురు సభ్యు లు బ్యాంకు వారికి కట్టాల్సిన నగదు మొత్తం మాట్లాడి సెటిల్ చేసుకోవడంతో ప్రేమలతకు చెందిన గేటు అక్కడే వదిలి వెళ్లారు. మరో గ్రూపు లో వారు కూడా డబ్బులు కట్టకపోవడంతో మద్దెబోయిన కళమ్మకు చెందిన గేటును తీసుకువెళ్లారు.
పన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 12 : నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో ఏండ్ల తరబడి పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. బుధవారం ఆదర్శనగర్ కాలనీకి చెందిన ఓ ఇంటి యజమాని ఆరేండ్ల నుంచి రూ.68 వేల పన్ను చెల్లించకపోవడంతో అతని ఆస్తులను జప్తు చేశారు. అతనితోపాటు ఎన్టీఆర్ మార్గ్, రాంనగర్ కాలనీ, ఇందిరమ్మ కాంప్లెక్స్‌లోని ఫర్టిలైజర్ దుకాణాన్ని సీజ్ చేశారు. పన్నులు చెల్లించని వారి ఆస్తులను స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జప్తు చేశారు. మూడెకరాల