హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : నిబంధనలకు విరుద్ధంగా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయిస్తున్న పలు మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. కొడైన్ కలిగి ఉన్న దగ్గుమందు, నైట్రావె ట్, అల్ఫ్రాజోలం, ట్రమడోల్, జోల్పిడెమ్, టైడల్ మాత్రలు, మెఫెన్టర్మైన్, అట్రాక్యూరియమ్ బెసిలెట్ ఇంజెక్షన్లను విచ్ఛలవిడిగా అమ్ముతున్నట్టు డీసీఏ అధికారులు ఈ సోదా ల్లో గుర్తించారు. 63 మెడికల్ షాపులకు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఉపాధిహామీ పథకానికి రాముడి పేరు పెట్టి పేదల పొట్టకొడతారా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రను ప్రతిఒకరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గురువారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో వీబీ-జీ-రామ్-జీ-2025 బిల్లును వ్యతిరేకిస్తూ బిల్లు ప్రతులను దహనం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం మల్లాపూర్‌కు చెందిన వృద్ధుడు డప్పు మల్లయ్యకు ఆశ్రయం కల్పించాలని ఎస్‌హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు. మల్లయ్య శంషాబాద్‌లోని రాళ్లగూడ ఫ్లైఓవర్ కింద ఫుట్‌పాత్‌పై దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నట్టు ఇటీవల పత్రికల్లో రావడంతో ఎస్‌హెచ్చార్సీ సుమోటోగా స్వీకరించింది. సమగ్ర నివేదికను వచ్చేనెల 19లోగా సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించింది.