హనుమకొండ, మార్చి 19: మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కుట్టు మిషన్లు అందజేస్తున్నామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
పోచంపల్లి ఫౌండేషన్, ఏపీఎల్ హెల్త్ కేర్ ఆర్థిక సాయంతో సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్‌ంట్ వారి నిర్వహణలో మహిళలకు గతంలో ఉచిత శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో వారికి బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాసర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరై 378 మంది లబ్ధిదారులకు కుట్టుమిషన్లు అందజేశారు.